టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం సోదరుడిపై కేసు

హైదరాబాదులోని అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోదరుడు కాలేరు సురేష్ మీద రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించినందుకు ఆ కేసు నమోదు చేశారు.

TRS MLA Kaleru Venkatesh's brother booked

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం సోదరుడు కాలేరు సురేష్ మీద రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేసినందుకు సురేష్ మీద పోలీసులు కేసు పెట్టారు. 

కాలేరు సురేష్ ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఏదులాబాద్ సర్పంచ్. దాంతో ఆయన బుధవారంనాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయనపై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. 

సురేష్ లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించారని, సోషల్ డిస్టాన్స్ కూడా పాటించలేదని, అక్కడ 50 మందికిపైగా గుమికూడారని పోలీసులు చెప్పారు. వివిధ సెక్షన్ల కింద సురేష్ పై కేసు నమోదు చేశారు. 

ఇదిలావుంటే, తెలంగాణలో గురువారంనాటికి 700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18 మంది మరణించారు. పైగా, జిహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కంటైన్మెంట్లను కూడా ఏర్పాటు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios