Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్ట్‌పై దాడితో సంబంధం లేదు: ఎంపీ అరవింద్ పై జీవన్ రెడ్డి ఫైర్

మక్లూర్ లో ఓ జర్నలిస్టుపై జరిగిన దాడితో తనకు సంబంధం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

TRS MLA Jeevan Reddy serious Comments on Nizambad MP dharmapuri arvind
Author
Hyderabad, First Published Jan 18, 2022, 8:08 PM IST

నిజామాబాద్: మక్లూర్ మండలంలో జర్నలిస్టుపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి Jeevan Reddy స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన  ఫేస్ బుక్ లైవ్ ద్వారా  ఈ విషయమై వివరణ ఇచ్చారు. corona  కారణంగా తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. దీంతో ఈ లైవ్ ద్వారా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.

Journlist పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన నిందితులను పట్టుకోవాలని పోలీసు అధికారులకు చెప్పానన్నారు. నిజామాబాద్ ఎంపీ dharmapuri arvind,  bjp  మూక చిల్లర రాజకీయాలు చేస్తూ తన మీద బురద చల్లే కుట్ర చేశారన్నారు. . జర్నలిస్టులు బిజెపి ట్రాప్ లో పడొద్దని ఆయన కోరారు.

 వైకుంఠ ఏకాదశి సందర్భంగా Tirumala శ్రీవారి దర్శనం కోసం వెళ్లానని చెప్పారు. ఈ నెల 15వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు చెప్పారు. అయితే అదే రోజున తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని ఆయన వివరించారు. .తాను లేని సమయంలో, తనకెలాంటి సంబంధం లేకుండా జరిగిన జర్నలిస్ట్ పై దాడి ఘటనను తనకు ఆపాదించ డాని కి అరవింద్ కుట్ర చేయడం సిగ్గుచేటన్నారు.

"

 20ఏండ్లు గా ఉద్యమం లో, రాజకీయాలలో జర్నలిస్టుల తో కలిసి పని చేస్తున్నానన్నారు.  జర్నలిస్టు ఫ్రెండ్లీ ఎమ్మెల్యే నని ఆయన సమర్ధించుకొన్నారు.  గతంలో జర్నలిస్ట్ పై తుపాకి ఎక్కుపెట్టి దాడి చేసిన చరిత్ర అరవింద్ కే ఉందన్నారు. 

 తాను dubai వెళ్లి అక్కడి నుంచి లైవ్ లో సవాల్ చేస్తే అరవింద్ తోక ముడిచాడని జీవన్ రెడ్డి చెప్పారు. అయినా వ్యక్తిత్వం మార్చుకోకుండా బరి తెగించి అబద్దాలు చెపుతున్న అరవింద్ ను బట్టేబాజ్, బాక్వాస్, బడా జూటా -బీ-3 ఎంపీ అంటున్నామని తెలిపారు.

 తండ్రీ కొడుకులు తలో పార్టీలో ఉన్నారని, ఒకే ఇంట్లో మూడు కుంపట్లు అని ఆయన ఎద్దేవా చేశారు. అరవింద్ ముందు నీ ఇల్లు చక్కబెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడాలని హితవు పలికారు. వర్ధంతి కి జయంతి కి తేడా తెలియని ఈ అబద్దాలకోరును  పసుపు బోర్డు తేకుండా పంగనామాలు పెట్టాడన్నారు.

డ్రగ్ ఆడిక్ట్ సైకో అంటూ అరవింద్ పై జీవన్ రెడ్డి మండిపడ్డారు. .అరవింద్ ది నేర చరిత్ర. ఆయన కుటుంబానిది ఘోర చరిత్ర. అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు.  డీ ఎస్ అంటే డాడీ సన్ డ్రామా సెటైర్లు వేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios