తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సభకు రానివాళ్లకు పెన్షన్లు ఇవ్వొద్దంటూ గ్రామ కార్యదర్శికి ఆయన హుకుం జారీ చేశారు. 

తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలలో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శిపై ఆయన నోరు జారారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కొందరు లబ్ధిదారులు రాకపోవడంపై ఎమ్మెల్యే గాదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని కార్యదర్శికి సూచిస్తూ దురుసుగా మాట్లాడారు. ఎమ్మెల్యే పరుష పదజాలం ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.