టిఆర్ఎస్ ఎర్రబెల్లి ఇఫ్తార్ విందు

trs mla errabelli dayakar rao iftar pary
Highlights

దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ జిల్లా: రాయపర్తి మండల కేంద్రంలో రంజాన్ మాసం సంధర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పేద ముస్లింలకు రంజాన్ కానుకల అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద ముస్లీంల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. దేశ చరిత్రలోనే మైనార్టీ గురుకులాలను నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. సియం కేసిఆర్ కు మైనార్టీ వర్గాలు అండగా నిలవాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గంలో మైనార్టీలకు అవసరమైన కబరస్థాన్, ఈద్గాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

loader