Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయ్ భాస్కర్: ఆరుగురు విప్ లు వీరే..


తెలంగాణ శాసన సభకు ఒక ప్రభుత్వ చీఫ్ విప్ తోపాటు ఆరుగురు విప్ లను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను నియమించారు. అలాగే విప్ లుగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.  

trs mla d.vinay bhaskar elected as a government chief whip
Author
Hyderabad, First Published Sep 7, 2019, 7:49 PM IST

హైదరాబాద్: ఈనెల 10 నుంచి తెలంగాణ శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పదవులు భర్తీ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేశారు. 

తెలంగాణ శాసన సభకు ఒక ప్రభుత్వ చీఫ్ విప్ తోపాటు ఆరుగురు విప్ లను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను నియమించారు. అలాగే విప్ లుగా ఆరుగురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.  

ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరెకపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్ లను నియమించారు. ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లుగా నియామకం దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో మరికాసేపట్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.  

ఇకపోతే గత అసెంబ్లీలో గొంగిడి సునీత ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2009లో ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన సునీత కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ పై గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 

మరోవైపు దాస్యం వినయ్ భాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించారు. 2015లో సీఎంవోలో పార్లమెంట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 

ఇకపోతే రేగ కాంతారావు పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 

ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించిన రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios