హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో పార్లమెంటరీ, శాసనసభపక్ష సమావేశాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు.

 

జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ కూడ కసరత్తు చేస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేంద్రీకరించిన విషయం తెలిసిందే.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్ లో అంతర్మథనానికి కారణమైంది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం దక్కకుండా చూడాలని పార్టీ నేతలకు కేసీఆర్  దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలను పలు డివిజన్లకు టీఆర్ఎస్ ఇంచార్జులుగా నియమించింది.ఇప్పటికే ఎమ్మెల్యేలను పలు డివిజన్లకు టీఆర్ఎస్ ఇంచార్జులుగా నియమించింది. నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలతో మంత్రి కేటీఆర్ విడి విడిగా సమావేశమౌతున్నారు.