పాలమూరులో వర్గ పోరు తీవ్రమైంది. అన్ని పార్టీల వారు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టిఆర్ఎస్ గూటికి చేరుకోవడంతో  ఒకరంటే ఒకరికి పడడంలేదు. దీంతో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు.

తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా లింగాల ఎంపిపి మంజుల భర్త అయిన చీర్ల కృష్ణ పై అదే మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు దాడిచేసి గాయపరిచారు. అచ్చం పేట మండలం రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గా జాతరలో చీర్ల కృష్ణపై టిఆర్ఎస్ వాళ్లే దాడి కి పాల్పడ్డారు. బాధితుడిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్ అయింది.