తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ (Vinod Kumar) హెచ్చరించారు. టీఆర్‌ఎస్ సర్కార్‌పై బీజపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ (Vinod Kumar) హెచ్చరించారు. టీఆర్‌ఎస్ సర్కార్‌పై బీజపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంగళవారం ఆయన టీఆర్‌ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్దిపై చర్చకు సిద్దమా అని బీజేపీ నేతలకు సవాలు విసిరారు. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తే వచ్చారని క్రియేట్ చేశారని విమర్శించారు.
ప్రతి విషయాన్ని సానుకూలంగా మార్చుకోవడం బీజేపీ నేతలకు అలవాటేనని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి పాలన సాగుతుందో ఆలోచన చేసుకోవాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా ముందు, కార్యకర్తల ముందు తెలంగాణ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే.. తెలంగాణ పథకాల గురించి ఎందుకు స్టడీ చేస్తున్నారని విమర్శించారు.
