వీరభద్రం కుటుంబం ఆదిపత్యానికి చెక్ పెట్టాడనే హత్య: తమ్మినేని కృష్ణయ్య భార్య

తన భర్త హత్యకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని ఇవాళ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య భార్య మంగతాయారు చెప్పారు. తన భర్తను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 

TRS leader Tammineni Krishnaiah Wife  Manga Reacts on Her Husbands Murder

ఖమ్మం: తన భర్త  హత్యకు  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని కృష్ణయ్య భార్య మంగ  తాయమ్మ ఆరోపించారు. 

సోమవారం నాడు ఉదయం జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొని తెల్దార్ పల్లికి తమ్మినేని కృష్ణయ్య వస్తున్న సమయంలో ప్రత్యర్ధులు ఆయనను హత్య చేశారు.  ఈ హత్య ఘటనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఈ హత్యకు తమ్మినేని కోటేశ్వరరావు కారణమని ఆరోపిస్తూ కోటేశ్వరరావు ఇల్లు, గ్రానైట్ ఫ్యాక్టరీపై  కృష్ణయ్య అనుచరులు దాడికి దిగారు. 

సీపీఎం నేత కోటేశ్వరరావు తన భర్త హత్యకు ప్రధాన కుట్ర దారుడని కృష్ణయ్య భార్య మీడియాకు చెప్పారు.  కోటేశ్వరరావుతో పాటు గ్రామానికి చెందిన కొందరు సీపీఎం కార్యకర్తలు కూడా ఈ హత్యలో పాల్గొన్నారని  ఆమె ఆరోపించారు. ఈ హత్య వెనుక  ఎవరున్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారులకు మరణ శిక్ష విధించాలని  ఆమె కోరారు.

గ్రామంలో తమ ఆధిపత్యానికి కృష్ణయ్య చెక్ పెట్టాడనే అక్కసుతోనే తమ్మి,నేని  వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. గతంలో రెండు దఫాలు సీపీఎం నుండి తమ్మినేని కృష్ణయ్యను సస్పెండ్ చేయించారని ఆమె చెప్పారు. తాము సర్పంచ్ పదవికి పోటీకి నామినేషన్ వేస్తే ఉపసంహరింపచేసుకోవాలని బెదిరించారన్నారు  గ్రామంలో తమ్మినేని కోటేశ్వరరావు, ఆయన సోదరుడు వీరభద్రం అవినీతికి వ్యతిరేకంగా కృష్ణయ్య పోరాటం చేయడంతో ఆయనను కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించారు. రెండో దఫా పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించినట్టుగా చెప్పారు. గ్రామంలో తమ ఆధిపత్యానికి కృష్ణయ్య అడ్డు నిలవడంతోనే హత్య చేశారని ఆమె మీడియాకు తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి కృష్ణయ్య కొడుకు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఇండిపెండెంట్ గా విజయం సాధించిన తర్వాత కృష్ణయ్య టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు.

also read:వ్యక్తిగత ఎదుగుల ఓర్వలేకే హత్య: తమ్మినేని కృష్ణయ్య మృతదేహనికి నివాళులర్పించిన తుమ్మల

గ్రామంలో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో తెల్దార్ పల్లి లో  సీపీ విష్ణు వారియర్ పర్యటించారు. గ్రామంలో  144 సెక్షన్ విధించారు. సీపీఎం కేత తమ్మినేని కోటేశ్వరరావు ఇంటితో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీపై దాడికి దిగిన కృష్ణయ్య అనుచరులను చెదరగొట్టారు. ఈ హత్యకు రాజకీయ కారణాలున్నాయా లేక  కుటుంబ తగాదాలు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ విష్ణు వారియర్ చెప్పారు.  ఈ హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు నాలుగు పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసినట్టుగా సీపీ చెప్పారు . తమ్మినేని  కృష్ణయ్య మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios