టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యా దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో కృష్ణయ్యను దుండగులు హత్య చేశారు.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో కృష్ణయ్యను దుండగులు హత్య చేశారు. కత్తులు, కొడవళ్లతో అతి కిరాతకంగా నరికిచంపారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణయ్య హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. తెల్దారుపల్లిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమ్మినేని కృష్ణయ్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడు అవుతారు. అయితే టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న కృష్ణయ్య.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇక, తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని అని గతంలో కృష్ణయ్య చెప్పేవారు.
