భూసరిహద్దు కోసం చెలరేగిన గొడవ ఓ టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్యకు కారణమయ్యింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామానికి, పార్టీకి పెద్దదిక్కుగా వుండే నాయకుడు హత్యకు గురవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూసరిహద్దు కోసం చెలరేగిన గొడవ ఓ టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్యకు కారణమయ్యింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామానికి, పార్టీకి పెద్దదిక్కుగా వుండే నాయకుడు హత్యకు గురవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు సమీపంలోని పెద్దెముల్ మండలం మంబాపూర్ కు చెందిన దేశ్ పాండే చంద్రవర్మ ప్రసాదరావు(55) కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివాసముంటున్నాడు. ఇతడికి గ్రామంలో 40 ఎకరాల పొలం ఉండటంతో వ్యవసాయ పనుల కోసం తరచూ గ్రామానికి వస్తుంటాడు. అయితే ఇటీవల వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు తగ్గడంతో ప్రసాద్ రావు పొలంలో ఇప్పటికే వున్న బోరులో నీరు తగ్గాయి. దీంతో వరితో పాటు మామిడి తోటకు సరిపడా నీరందక ఎండిపోతున్నాయి.
దీంతో మరో బోరు బావిని తవ్వించాలని అతడు నిర్ణయించాడు. దీంతో మంగళవారం పొలం గట్టుకు సమీపంలో బోరు వేయించడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పక్క పొలానికి చెందిన రైతులు(అన్నదమ్ముళ్లు) గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, శివారెడ్డిలు వెంటనే బోరు వేయడం ఆపాలని ప్రసాదరావుకు హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ప్రసాద రావుపై వారు కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రసాద రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసాద రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్యతో పాటు కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని ఇందుకు కారణమైన నిందితులను అరెస్ట్ చేసినట్లు
పోలీసులు తెలిపారు.
పాత కక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పక్క పక్కనే భూములు ఉండటంతో సరిహద్దుల విషయంలో మృతుడికి, నిందితులను మధ్య తరచూ గొడవలు జరిగేవని గ్రామస్థులు తెలిపారు. అయితే దీనికి తోడు ఇటీవల వీరి మధ్య రాజకీయ వైరం కూడా మొదలయ్యిందని...అందువల్లే ఈ హత్య చేసి వుంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 2, 2019, 3:58 PM IST