గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో ఆ పార్టీ నేత కట్టెల శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. 

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సందర్భంగా టీఆర్ఎస్ భవన్ లో ఆ పార్టీ నేత కట్టెల శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు విజయం సాధించారు. ఈ విజయం సందర్భంగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు.

ఈ సమయంలో టీఆర్ఎస్ హైద్రాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ తన చేతిలో గన్ తీసుకొని ప్రదర్శించారు.

గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తే పక్కన ఉన్న నేతలు వారించినట్టుగా చెబుతున్నారు. ఇతర నేతలు వారించడంతో కట్టెల శ్రీనివాస్ తుపాకీని జేబులో పెట్టుకొన్నారు.

అయితే కట్టెల శ్రీనివాస్ కు ఈ తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తుపాకీని ప్రదర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.

కట్టెల శ్రీనివాస్ తీరుపై టీఆర్ఎస్ నాయకత్వం కూడ సీరియస్ గా ఉందని సమాచారం. ఈ విషయమై టీఆర్ఎస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.