తెలంగాణ ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను ముందుగానే అందించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని వికారి నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలందరు ఉగాది పండగను వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ  కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలందరికి అన్ని శుభాలే జరగాలని కోరుకుంటున్నాని హరీష్ తెలిపారు. 

తెలుగు ప్రజల నూతన సంవత్సరాది అయిన ఉగాది పండగ శనివారం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే ప్రజలకు పండగా శుభాకాంక్షలు తెలిపిన హరీష్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలు , సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తోందన్నారు. ఈ  తెలుగు నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంతో వారు సంతృప్తిగా వున్నారన్నారు. 

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో ఆనందంతో వుండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నానన్నారు. ఈ కొత్త సంవత్సరం అన్ని కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నట్లు హరీష్ వెల్లడించారు.