తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మద్య ప్రచార సమరం జరుగుతోంది. కేవలం ప్రచారంలోనే కాదు ఈ సమరం వ్యక్తిగతంగా సాగుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు వరుసగా పోలీస్ కేసులతో సతమతమయ్యారు. కాగా రేవంత్ రెడ్డిపై గురువారం ఉదయం ఐటీ దాడులు జరిగాయి. దీంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం తమ నాయకులపై దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత గట్టు రాంచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. ఓటుకు నోటులో మాత్రమే కాదు రేవంత్ రెడ్డి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని ఆరోపించిన ఆయన ఆ వివరాలను వెల్లడించారు.

రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నివాసముండే సమయంలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వం కోసం ప్రాకులాడాడని రాంచంద్రరావు గుర్తుచేశారు. అంతే కాదు ఇలా సామాన్య కార్యకర్తగా ఉంటూ దొంగ ఓట్లు వేసిన చరిత్ర రేవంత్ కు ఉందని విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయిని గట్టు ప్రశ్నించారు. సూటిగా చెప్పాలంటే రేవంత్ ఓ డేరా బాబా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక టిడిపిలో ఉన్నపుడు తన గురువు చంద్రబాబు మాదిరిగానే రేవంత్ కూడా బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ కాంగ్రెస్ లో చేరాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు కాంగ్రెస్ పై పగ తీర్చుకోడానికే చంద్రబాబు ఈ ప్లాన్ వేశాడని....వీరి ఉచ్చులో కాంగ్రెస్ ఇరుక్కుందని రాంచంద్రరావు వివరించారు. 

రేవంత్ పై కేంద్ర ప్రభుత్వ ఆదీరంలోని ఐటీ సంస్థ దాడులు నిర్వహిస్తే అందుకు టీఆర్ఎస్ ఎలా కారణమవుతుందో చేప్పాలని కాంగ్రెస్ నాయకులకు ప్రశ్నించారు. రేవంత్ ఏ పార్టీలో వుంటే ఆ పార్టీలో అతడికి శత్రువులు ఉంటారన్నారు. ఇప్పుడు కూడా ఈ ఐటీ దాడుల వెనుక ఏ కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడో ఎవరిని తెలుసంటూ తన సందేహాన్ని వ్యక్తపర్చారు. రేవంత్ ఆస్తులు అక్రమం కాదని ఏ కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలడా అంటూ గట్టు రాంచంద్రరావు ప్రశ్నించారు.