టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో అనుకోకుండా ఓ టీఆర్ఎస్ నేత కన్నుమూసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా... పార్టీ నేతలంతా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు టీఆర్ఎస్ నేతలు ఆదివారం కుత్బుల్లాపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇదిలా ఉండగా.. ప్రచారంలో పాల్గొన్న నేతల కోసం పార్టీ..రుక్మిణీ ఎస్టేట్ లో భోజన సదుపాయాలు చేపట్టింది. అయితే... అక్కడ భోజనం చేస్తూ.. రమేష్(57) అనే వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

గుండెపోటు కారణంగా రమేష్ మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.  ఈ ఘటనతో కార్యకర్తలంతా షాక్ కి గురయ్యారు.