పరకాల పట్టణ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకడైన వజ్ర రవికుమార్ ఇవాళ ఉదయం ఆకస్మికంగా మృత్యువాతపడ్డారు. రవికుమార్ (46) కు అనారోగ్యంతో భాదపడుతూ గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ తెల్లవారుజామున హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆస్పత్రిలోనే మృతిచెందారు. 

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రవికుమార్ టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఉండగానే అతడు గుండెపోటుకు గురయ్యాడు. అతన్ని బ్రతికించడానికి డాక్టర్లు ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది.

రవికుమార్ మృతితో పరకాల టీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది.  టీఆరెఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు సన్నిహితులు, పట్టణ ప్రజలు కూడా రవికుమార్ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.