ఓ అమ్మాయి కోసం కొందరు ఆకతాయిల మధ్య జరిగిన గొడవలో ఓ టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొత్తపేట గ్రామానికి చెందిన కొందరు యువకులు ఓ అమ్మాయి విషయంలో గొడవ పడుతున్నారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కిరాణ షాపు యజమాని, టీఆర్ఎస్ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడు లతీఫ్ గమనించాడు. అందులో తన సోదరుడి కుమారుడు కూడా ఉండటంతో.. ... వాళ్ల వ్యవహారంలోకి దూరి.. గొడవను సద్ధిమణిగించేందుకు ప్రయత్నించారు. దీంతో వారు తమ కోపాన్ని లతీఫ్ పై చూపించారు. ఈక్రమంలోనే లతీఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. 

Also Read ప్రియురాలి పెళ్లి... తట్టుకోలేక ప్రియుడు రైలుకింద పడి..

అయితే.. లతీఫ్ సోదరిడి కుమారుడి వల్లే అసలు ఈ గొడవ ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు వాట్సాప్‌ స్టేటస్‌లో ఓ అమ్మాయికి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు పెడుతూ ఓ ఫోటో పెట్టాడు.

అయితే ఈ స్టేటస్‌సు చూసి జీర్ణించుకోలేని స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు జహంగీర్‌ కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. తన కిరాణా షాపు ఎదుటే తన సోదరుడి కుమారుడిపై దాడిచేస్తున్న యువకులను లతీఫ్‌ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు.  ఆగ్రహించిన ఆ యువకులు లతీఫ్‌పై విచాక్షణ రహితంగా దాడి చేశారు. ఈ క్రమంలోనే కత్తితోనూ పొడిచారు. దీంతో లతీఫ్ స్పాట్‌లో చనిపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.