Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ అధికారిణిపై టీఆర్ఎస్ లీడర్ దాడి

ఓ మహిళా మున్సిపల్ అధికారిణిని టీఆర్ఎస్ లీడర్ భౌతిక దాడికి దిగిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయిన తన కొడుకు విగ్రహాన్ని కూల్చివేయించినందుకు టీఆర్ఎస్ మహిళా నేత, ఆల్వాల్ జీహెచ్ఎంసీ కో ఆప్షన్‌ మెంబర్‌ జ్యోతి గౌడ్ ఈ దాడికి పాల్పడ్డారు. అయితే అధికారిణిపై దాడికి నిరసనగా జీహెచ్ఎంసీ సిబ్బంది ధర్నాకు దిగారు. దీంతో ఆల్వాల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

trs leader attack on municipal officer
Author
Alwal, First Published Sep 17, 2018, 5:29 PM IST

ఓ మహిళా మున్సిపల్ అధికారిణిని టీఆర్ఎస్ లీడర్ భౌతిక దాడికి దిగిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చనిపోయిన తన కొడుకు విగ్రహాన్ని కూల్చివేయించినందుకు టీఆర్ఎస్ మహిళా నేత, ఆల్వాల్ జీహెచ్ఎంసీ కో ఆప్షన్‌ మెంబర్‌ జ్యోతి గౌడ్ ఈ దాడికి పాల్పడ్డారు. అయితే అధికారిణిపై దాడికి నిరసనగా జీహెచ్ఎంసీ సిబ్బంది ధర్నాకు దిగారు. దీంతో ఆల్వాల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ గొడవలో గాయపడిని ఆల్వాల్ మున్సిపల్ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ మాధవి ఈ ఘటన గురించి వివరించారు. ఆల్వాల్ ప్రాంతంలోని ఇందిరాగాంధి విగ్రహం పక్కన ఎలాంటి  అనుమతులు లేకుండా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తమకు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ విగ్రహం లేకుండా కేవలం దిమ్మె మాత్రమే ఉండటంతో దాన్ని తొలగించినట్లు మాధవి తెలిపారు.

అయితే ఈ విగ్రహం టీఆర్ఎస్ నాయకురాలు,జీహెచ్ఎంసీ కోఆప్షన్ మెంబర్ గొట్టిముక్కల జ్యోతి గౌడ్ కుమారుడి స్మారకార్థం నిర్మిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం గొట్టిముక్కల అఖిల్ మరణించడంతో తాజాగా అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఈ కూల్చివేత జరగడంతో ఆగ్రహానికి లోనైన జ్యోతి గౌడ్ తన అనుచరులతో కలిసి వచ్చి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మాధవిపై దాడి చేశారు. 

అధికారిణిపై దాడిని ఖండిస్తూ మున్సిపల్ అధికారులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఈ దాడిలో గాయపడిన అధికారిణి మాధవి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios