గుప్త నిధుల వేటలో పట్టుబడిన టీఆర్ఎస్ నేత: దేవీ విగ్రహాన్ని పెకిలించి...

నల్లమల అడవుల్లో భ్రమరాంబికా దేవి విగ్రహాన్ని పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన టీఆర్ఎస్ నేత తిరుమలేష్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు.

TRS leader arrested for hunting hidden treasure in Nallamala

హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాల జరిపిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత పి. తిరుమలేష్ నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ రేంజ్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల్లో హైదరాబాదులోని బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు తిరుమలేష్ నాయుడిని నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. 

ఆలయంలోని భ్రమరాంబికా విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు తేలింది. తిరుమలేష్ నాయుడికి సహకరించిన ఎల్లప్ప, బాలస్వామి, శ్రీనులతో పాటు దడైర్వర్ షహబాజ్ అలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాటు వేసిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తున్న ముఠాను పట్టుకున్నారు. 

చెంచులు, గిరిజనులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వల పన్ని ఆ ముఠాను పట్టుకున్నారు. వారిని విచారించగా ఈ నెల 8వ తేదీన అడవిలోకి ప్రవేశించి రెక్కీ నిర్వహించి తిరిగి సోమవారం సాయంత్రం అడవిలోకి వెళ్లి రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తేలింది. 

పెద్ద నోట్ల రద్దు రద్దు సమయంలో కూడా తిరుమలేష్ నాయుడు కరెన్సీ మారుస్తానని చెప్పి ఓ ఇన్ స్పెక్టర్ తో చేతులు కలిపి బెదిరించిన కేసులో జైలు పాలై బెయిల్ పై బయటకు వచ్చాడు. కొద్ది రోజులకే నార్ిసంగ్ లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ లో రివాల్వర్ తో బెదిరించిన ఘటనలో కూడా జైలుకు వెళ్లి వచ్చాడు. 

ఈ రెండు కేసులను పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి పోలీసులకు మరోసారి చిక్కాడు. గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్న తిరుమలేష్ నాయుడు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరాడు. హైదరాబాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ టీఆర్ఎస్ నేతకు అతను అనుచరుడని తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios