Asianet News TeluguAsianet News Telugu

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: రాఘవేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, వనమా ఇల్లు ముట్టడి

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వనమా రాఘవేందర్ పై టీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ అయింది. ఈ విషయమై టీఆర్ఎస్ నాయకత్వం రాఘవేందర్ పై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

Trs Hi command Serious on Vanama Raghavender over Ramakrishna Family Suicide case
Author
Hyderabad, First Published Jan 6, 2022, 11:58 AM IST

 ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా Palwancha లో Ramakrishna  కుటుంబ ఆత్మహత్య ఘటనపై Trs నాయకత్వం సీరియస్ అయింది.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడే Vanama Raghavender. తనతో పాటు తన కుటుంబంతో ఆత్మహత్యకు వనమా రాఘవేందర్ కారణమని  ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో రామకృష్ణ తెలిపారు.ఈ వీడియో  ఇవాళ మీడియాలో ప్రసారమైంది.  రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని  బీజేపీ నేతలు గురువారం నాడు ముట్టడించారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని  విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  వనమా రాఘవేందర్ రావు ఎంత దారుణంగా తనను వేధింపులకు గురి చేశాడో రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో ప్రస్తావించాడు. తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు రావాలని వనమా రాఘవేందర్ ఆర్ఢర్ వేశాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులైతే ఇవ్వగలను కానీ, భార్యను ఎలా పంపగలనని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సెల్పీ వీడియో బయటకు రావడంతో విపక్షాలు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

 పాల్వంచలోని కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు ఇంటిని ఇవాళ ఉదయం బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాఘవేందరరావు అరాచకాలకు ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

also read:వనమా రాఘవ నా భార్యను పంపించాలని అడిగాడు: రామకృష్ణ సెల్ఫీ వీడియో

ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తొలుత గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు రామకృష్ణ కుటుంబం చనిపోయిందని భావించారు. అయితే మృతులున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యం కావడంతో  రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆత్మహత్య చేసకోబోయే ముందు రామకృష్ణ  తీసుకొన్న సెల్ఫీ వీడియో ఇవాళ మీడియాలో ప్రసారమైంది. 

కొత్తగూడెం  నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర అరాచకాలకు అడ్డూ లేకుండా పోయిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.  రాఘవేంద్ర వేధింపులతో  పలు కుటుంబాలు ఇబ్బంది పడిన ఘటనలు కూడా ఉన్నాయి.  అయితే రాఘవేందర్ ను కఠినంగా శిక్షించకుండా వదిలేయడంతోనే పదే పదే ఇదే తరహా ఘటనలు చోటు చేసకొంటున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

వనమా రాఘవేందరావుపై  సస్పెన్షన్ వేటు పడే అవకాశం

 కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు వ్యవహరంపై టీఆర్ఎస్ నాయకత్వం  సీరియస్ గా ఉంది.ఈ విషయమై పార్టీలో చర్చ సాగుతుంది. వనమా రాఘవేందర్ రావును పార్టీ నండి సస్పెండ్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రానికి ఈ విషయమై గులాబీ పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 

వనమా రాఘవేందర్ ను అరెస్ట్ చేయాలి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తనయుడు రాఘవేందరావు వేధింపులను తట్టుకోలేకే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వనమా రాఘవేందర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios