Asianet News TeluguAsianet News Telugu

గ్రాడ్యూయేట్ల సమస్యలు నాకు బాగా తెలుసు.. టీఆరెస్ అభ్యర్థి సురభి వాణీదేవి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నగరం నుండి పోటీచేస్తున్న టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి తెలంగాణ భవన్ కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు  పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నానని అన్నారు. 

trs graduate mlc candidate surabhi vani devi visits telangana bhavan - bsb
Author
Hyderabad, First Published Feb 24, 2021, 3:21 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నగరం నుండి పోటీచేస్తున్న టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి తెలంగాణ భవన్ కు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు  పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నానని అన్నారు. 

ఆమె ఇంకా మాట్లాడుతూ నా నరణరాల్లో ప్రజాసేవ జీర్ణించుకోపోయింది, నేను ఇప్పటికే విద్యాసంస్థలను స్థాపించి విద్య సేవ చేస్తున్నాను. 35 ఏళ్లుగా విద్యార్థులను గైడ్ చేస్తూ విద్యాసేవలో మునిగిపోయానని అన్నారు. 

అంతేకాదు గడిచిన 35 ఏళ్లలో మా విద్యాలయాల నుంచి  1లక్షకు పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారని చెప్పుకొచ్చారు. చిన్న అణువు నుంచి అంతరిక్షం వరకు నా విద్యార్థులు పనిచేస్తున్నారని గర్వంగా చెప్పుకొచ్చారు. 

35యేళ్లుగా గ్రాడ్యుయేట్ల సమస్యలను దగ్గర్నుండి చూశాను. కాబట్టి ఇప్పుడు నేను గెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేసే అవకాశం దక్కుతుంది అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురైన వాణీదేవి.. ఇంకా మాట్లాడుతూ మా నాన్నకు రిటైర్మెంట్ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లు-- నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios