Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త... జూన్ నుంచి అమలులోకి ఆసరా పింఛను పెంపు

ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎన్నికల హామీలో భాగంగా పింఛను లబ్ధిదారులకు అందజేసే మొత్తాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పెంపు చేసింది.

trs govt implements revised aasara pension scheme come into effect in june
Author
Hyderabad, First Published May 28, 2019, 4:19 PM IST

ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఎన్నికల హామీలో భాగంగా పింఛను లబ్ధిదారులకు అందజేసే మొత్తాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పెంపు చేసింది. ప్రస్తుతం అందిస్తున్న పింఛన్లను రెట్టింపు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 

పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జూలై నెలలో లబ్ధిదారులకు అందనున్నాయి. దివ్యాంగులకు నెలకు రూ.3016, మిగతా వారికి రూ.2016 పింఛను అందనుంది. పింఛన్లను పెంచుతామని టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, దాన్ని అమల్లోకి తెచ్చారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు ప్రభుత్వం పింఛన్ల పెంపు హామీని అమల్లోకి తీసుకువచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios