ముందస్తు ఎన్నికల నేపథ్యంలో.. బ్రేక్ పడిన బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చే వారంలో జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అధికారులు చీరల పంపిణీపై దృష్టి సారించారు. 

బతుకమ్మ పండగ కోసం ప్రభుత్వం 95 లక్షల చీరలను  పేదలకు పంపిణీ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. 

వచ్చే ఏడాది జనవరి 10 లోపు గ్రామాపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రక్రియ  మొదలు కావడానికి ముందే చీరలను పంపిణీ చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. 

పంచాయతీ ఎన్నికలను కోర్టు ఆదేశాల ప్రకారం జరపాల్సి వస్తే 20 రోజుల ముందే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది. దీంతో చీరలను పంచడం కుదరదు. అందుకే వచ్చే వారంలోనే.. 20వ తేదీకి ముందుగానే  పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాము ఎన్నికల్లో గెలిచిన వెంటనే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని టీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.