Asianet News TeluguAsianet News Telugu

జైపాల్ రెడ్డి ఓ పెద్ద బ్రోకర్... లగడపాటి ఓ పెద్ద దొంగ : శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని నివేదిక ఇచ్చినందుకే రాజీవ్ శర్మను మాజీ కేంద్ర జైపాల్ రెడ్డి టార్గెట్ చేశాడని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాజీవ్ శర్మ కాదు...నువ్వే పెద్ద బ్రోకర్‌వి అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఉన్నది ఉన్నట్లుగా తెలంగాణకు జరిగిన మోసం, రాష్ట్రం కోసం జరుగుతున్న చావుల గురించి హోం శాఖలో పనిచేస్తున్న కాలంలో రాజీవ్ శర్మ నిస్పక్షపాత నివేదిక ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. అంతే కాదు డిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించిన తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ శర్మ అనేక రకాలుగా నిధులు తీసుకువచ్చారనీ...అందుకోసమే ఆయన బ్రోకరా? అంటూ జైపాల్ రెడ్డిని ప్రశ్నించారు.  

trs ex mla srinivas goud fires on congress leaders
Author
Mahabubnagar, First Published Sep 13, 2018, 7:13 PM IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని నివేదిక ఇచ్చినందుకే రాజీవ్ శర్మను మాజీ కేంద్ర జైపాల్ రెడ్డి టార్గెట్ చేశాడని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాజీవ్ శర్మ కాదు...నువ్వే పెద్ద బ్రోకర్‌వి అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఉన్నది ఉన్నట్లుగా తెలంగాణకు జరిగిన మోసం, రాష్ట్రం కోసం జరుగుతున్న చావుల గురించి హోం శాఖలో పనిచేస్తున్న కాలంలో రాజీవ్ శర్మ నిస్పక్షపాత నివేదిక ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. అంతే కాదు డిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించిన తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ శర్మ అనేక రకాలుగా నిధులు తీసుకువచ్చారనీ...అందుకోసమే ఆయన బ్రోకరా? అంటూ జైపాల్ రెడ్డిని ప్రశ్నించారు.  

జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నపుడు తెలంగాణ కోసం పోరాడదాం రమ్మంటే రాలేడని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. అంతేకాదు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ మృతదేహాన్ని తెలంగాణ భవన్ కు తీసుకురానీయకుండా అడ్డుకుంది కూడా ఈ జైపాల్ రెడ్డేనని అన్నారు. 

ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల అంతు చూస్తానని జైపాల్ రెడ్డి బెదిరించారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ అధికారులే సకల జనుల సమ్మె చేసి తెలంగాణను తీసుకువచ్చారని, మీలా స్వార్థ రాజకీయాల కోసం ప్రాకులాడలేదని ఘాటుగా విమర్శించారు. మీ రాజకీయాల వల్లే ఇంత మంది అమరులయ్యారని ఆరోపించారు.

తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదురుకునే శక్తి లేక కొన్ని పార్టీలు కలిసి ఓ ముఠాను ఏర్పాటుచేసుకున్నాయని విమర్శించారు. వీరు తెలంగాణలో చేపట్టిన సర్వే బెడిసికొట్టి ఓటమి ఖాయమని తేలడంతో టీఆర్ఎస్ను ఓడించడానికి ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. వీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

 తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించడంతో పిచ్చెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. వీరికి తిప్పికొడితే 10 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రానున్న 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనతో తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ లోని పథకాలు అమలు చేయాలని చూస్తున్నాయని...రానున్న రోజుల్లో ప్రపంచంలో అనేక దేశాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అమలు చేస్తాయన్నారు.

లగడపాటి, రాయపాటి వంటి తెలంగాణ వ్యతిరేకులకు కాంగ్రెస్ నాయకులు తొత్తులుగా మారారని అన్నారు. పెద్ద దొంగ లగడపాటికి తెలంగాణలో ఏం తెలుసని సర్వే చేశాడని మండిపడిన శ్రీనివాస్ గౌడ్ ఆ సర్వేను ప్రజలేవరు నమ్మరని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios