వరిపై కేంద్రంపై పోరులో భాగంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు జాతీయ రహదారులను దిగ్భంధించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టత వచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిథులు ప్రకటించారు. 

హైదరాబాద్: Paddy ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ TRS ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలోని జాతీయ రహదారులను టీఆర్ఎస్ దిగ్భంధనం చేసింది. National Higy Ways పై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళనక దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా టీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికే మండల కార్యాలయాల్లో నిరసన దీక్షలను చేసింది. ఇవాళ జాతీయ రహదాదారుల దిగ్భంధనానికి టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 

 నాగపూర్, బెంగుళూరు, విజయవాడ, ముంబై హైవేలను దిగ్భంధనం చేయాలని టీఆర్ఎస్ నిర్ణ తీసుకొంది.ఈ జాతీయ రహాదారులున్న జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ రాస్తారోకో ల్లో పాల్గొన్నారు.

హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇదే జిల్లాలోని కోదాడ వద్ద కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో రహదారిని దిగ్భంధించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
మరో వైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బెంగుళూరు జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి Srinivas Goud సహా పలువురు ఎమ్మెల్యేలు జాతీయ రహాదారిపై బైఠాయించారు.

పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తెలంగాణ తరహలో పోరాటం చేస్తామని టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తుంది. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళన నిర్వహించనున్నారు.ఈ ఆందోళన తర్వాత కూడా కేంద్రం నుండి స్పష్టత రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడా టీఆర్ఎస కార్యాచరణను రూపొందించనుంది.

వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలపై బీజేపీ విమర్శలు చేస్తుంది. తమ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు టీఆర్ఎస్ వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

రాస్తారోకోలతో రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు

జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమంతో ఆయా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి జాతీయ రహదారులను దిగ్భంధనం చేస్తామని ముందుగానే ప్రకటించింది. అయితే జాతీయ రహదారులపై ఇతర రాష్ట్రాల నుండి కూడా వాహనదారులు వస్తారు. అయితే ఈ విషయం తెలియని వాహనదారులు ఈ రాస్తారోకోలతో ఇబ్బంది పడ్డారు.