హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ నేతలు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.

శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ను అవమానపర్చే విధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్ ను  ఆయన తప్పుబట్టారు.

హైద్రాబాద్ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ విషయమై సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి కోరినట్టుగా  ఆయన తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు గాను సీఎం కేసీఆర్ పై  ఇష్టారీతిలో బండి సంజయ్ మాట్లాడారని ఆయన విమర్శించారు. అంతేకాదు ప్రజలను రెచ్చగొట్టి తద్వారా ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఆ పార్టీ పొందేందుకు ప్రయత్నిస్తోందని  ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఆధారాలను కూడ అందించినట్టుగా ఆయన తెలిపారు.