ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలు, ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అయ్యారు. ఈనెల 21న 105 మంది అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అభ్యర్థులంతా తెలంగాణ భవన్‌కు హాజరుకావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలు, ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అయ్యారు. ఈనెల 21న 105 మంది అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అభ్యర్థులంతా తెలంగాణ భవన్‌కు హాజరుకావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన రోజే అంటే సెప్టెంబర్ 6న కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించారు. పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటే సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార సామగ్రిని సైతం పంపిణీ చేశారు.
అభ్యర్థుల ప్రచారంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గట్టి నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారం లోటుపాట్లుపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అభ్యర్థులతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం తీరు తెన్నులపై ఆరా తీశారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థులతో మరోసారి భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాల్లో ప్రచారం తీరు తెన్నులు, ప్రజల నుంచి వస్తోన్న స్పందన, ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు? ప్రజలనుంచి వస్తున్న అభ్యర్థనలేంటి వంటి అంశాలపై అభ్యర్థులతో నేరుగా చర్చించనున్నారు.
అలాగే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ప్రజల నుంచి ఎదురువుతున్న తిరుగుబాటు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ప్రతిపక్షాల తీరు, వారి ఆరోపణలను ఎదుర్కోనే అంశాలపై పలు సూచనలు చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అభ్యర్థులకు వివరించనున్నారు. పోలింగ్ వరకు అభ్యర్థులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
