హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయడు ఓ డర్టీ పొలిటీషియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చిన్న మోదీ అంటూ తనపై ఆరోపణలు చేసిన చంద్రబాబును మురికి రాజకీయ నాయకుడు అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయకుడు కాదని, మీడియా మేనేజర్‌ అని ఆరోపించారు. కొంత కాలం బీజేపీతో స్నేహం చేసి వదిలేశారని, గతంలో తిట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు చేతులు కలిపారని ధ్వజమెత్తారు. పార్టీల మార్పుపై ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

తెలంగాణలో బీజేపీ, మోదీ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. తమ కంటే కాంగ్రెస్‌ పార్టీ చాలా వెనుకబడి ఉందని వివరించారు. ఎన్నికల తర్వాత ఈ విషయం రుజువవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.