Asianet News TeluguAsianet News Telugu

నన్ను నరికేందుకు చంద్రబాబు భుజంపై గొడ్డలితో తిరుగుతన్నాడు: కేసీఆర్

 సీలేరు పవర్  ప్రాజెక్టులను ఎత్తుకెళ్లిన దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సొంత నియోకజవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. 

trs chief kcr comments in gajwel meeting
Author
Gajwel, First Published Dec 5, 2018, 3:50 PM IST

గజ్వేల్: సీలేరు పవర్  ప్రాజెక్టులను ఎత్తుకెళ్లిన దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సొంత నియోకజవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ బతికి ఉండగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వడంటూ హామీ ఇచ్చారు. 

పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని  తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు. పేదల  కంట కన్నీరు చూడని తెలంగాణ నాకు కావాలి, ఆకు పచ్చని తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే నా యజ్ఞం అన్నారు. ఎట్టి పరిస్థితిల్లో ఈ యజ్ఞం ఆగిపోకూడదన్నారు. 

గాలి గాలి ఓట్లు వేయోద్దని ఆలోచించి ఓట్లు వెయ్యాలని కోరారు. దాచి దాచి దయ్యాల పాలు చేయోద్దని హితవు పలికారు. మెుగ్గ తొడిగేటువంటి ప్రయత్నం. తాను చల్లిన విత్తనాలు ఫలాలు అందివ్వబోతుంది. ప్రాజెక్టులు నిండాలి పంటలు పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మన కాంగ్రెస్ అన్నలు దద్దమ్మలు, మెుద్దన్నలు అంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా నదిలో నీరు లేదని గోదావరి నదిలో నీళ్లు పంచుకుందామని ఎండార్స్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. హరీష్ రావు పటపట పళ్లు కొరకాలి అని తెలిపారు. 

కృష్ణా బేసిన్ లో  ఉన్న కోదాడలో ఉండి నీళ్లు లేవని చెప్తావా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో చంద్రబాబు నడిపే కీలు బొమ్మ ప్రభుత్వం నడపాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రాణం పోయినా తెలంగాణ హక్కులు కోల్పోయనివ్వడని అందువల్లే కేసీఆర్ అధికారంలోకి రాకుండా చూస్తున్నాడని మండిపడ్డారు. 

అక్రమంగా సంపాదించిన ఆస్తులను, మనుషులను, ఆకరికి ఇంటిలెజెన్స్ అధికారులను కూడా తెలంగాణలో మోహరించారని ఆరోపించారు. కేసీఆర్ లాంటి బక్కోడిని కొట్టేందుకు కాంగ్రెస్ కు చేతకాక చంద్రబాబు నాయుడును భుజాలపై మోసుకొస్తారా అంటూ మండిపడ్డారు. 

ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్న చంద్రబాబు నేడు కృష్ణా నదిలో నీళ్లు లేవని అబద్ధాలు చెప్తూ మన నోటిలో మట్టికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో ఈ కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను ఒకరికి బానిసను కానివ్వను. అయితే ఇప్పుడు పోరాడాల్సింది ప్రజలదేనన్నారు. ఓటుతో గట్టిదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. 

నిజాం ఆస్పత్రిలో కోమాలోకి పోతా అని చెప్పినా తాను ఆమరణ నిరాహార దీక్షను విరమించలేదన్నారు. ఆరోజు రాత్రే ప్రకటన వచ్చిందని అలా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని తెలిపారు. అలాంటి పోరాడి సాధించుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు, ఇనుప మూతి గద్దలకు ఇస్తే చాలా ప్రమాదం ఉంటుందని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం 17.7 శాతం ఆర్థిక అభిృద్ధి సాధించిందని మనకు దగ్గర్లో ఏ రాష్ట్రం లేదని కేసీఆర్ చెప్పారు. సీలేరు పవర్ ప్రాజెక్టు ను ఎత్తుకెళ్లిన దొంగ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో చెప్పిన విధంగా ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వడం లేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చెమ్మచీకటి అవుతుందన్న తెలంగాణను వెలుగుల జివ్వులుగా చేశానని కేసీఆర్ స్పష్టం చేశారు. నరేంద్రమోదీకి డబ్బా కొట్టే గుజరాత్ లో కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సంపదను పెంచామని తెలిపారు. అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మీ, కంటి వెలుగు, ఆసరా పెన్షన్లు పెంపు వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.  

ఆసరా పింఛన్లు పెంచడం వల్ల తెలంగాణలో వృద్ధులకు గౌరవం పెరిగిందన్నారు. రూ.1000 పింఛన్ ఇస్తున్నప్పటి నుంచే కోడల్లు, అల్లుళ్లు తిరిగి వృద్ధులను తిరిగి తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఈ పింఛన్ రూ.2016కు పెంచుతున్నానని మళ్లీ ఫలితంగా మరింత గౌరవం పెరుగుతుందన్నారు. 

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. కంటి వెలుగు పథకంతోనే తన పథకాలు ఆగిపోదని ఈఎన్టీ, రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగమన్నారు. 

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసి కొంతమంది ఏడుస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ మెుత్తం కోటి ఎకరాలకు మాయ చెయ్యాలని చంద్రబాబు భుజంపై గొడ్డలితో తెలంగాణ అంతా తిరుగుతున్నాడని కేసీఆర్ ను నరికేస్తే గొడవ వదిలిపోద్దని తిరుగుతున్నాడని ప్రజలు గమనించాలని కోరారు. 

కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందని తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ప్రజలు గమనించాలని కోరారు. 1956కు ముందు మన తెలంగాణ ఉందని అయితే నెహ్రూ ఉన్న తెలంగాణను ఊడగొట్టారని ఆరోపించారు. 

ఆనాటి బూర్గుల రామకృష్ణను తలపించేలా కాంగ్రెస్ నేతలు మెుద్దన్నలు, దద్దమ్మలుగా తయారయ్యారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి అంటే ఇవ్వనని చెప్తే కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా స్పందించారా ఒక్కరన్నా రాజీనామాలు చేశారా అంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడుకు ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ సమక్షంలో కృష్ణా నదిలో నీరు లేదని గోదావరి నీళ్లు పంచుకుందామా అని చెప్తాడా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కృష్ణానది నీరు గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఒక్కరైనా మైకు లాక్కునే ధైర్యం ఒక్కరికి లేదని అలాంటి వాళ్లు కాంగ్రెస్సోళ్లు అంటూ ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని నీరు నిండి భూములు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. ప్రజాకూటమిని గెలిపిస్తే శనీశ్వరం వస్తుందని ఆరోపించారు. శనీశ్వరం కావాలెనా కాళేశ్వరం కావాలా ప్రజలు గమనించాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios