గజ్వేల్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సర్వే కేసీఆర్ ది అంటూ జోస్యం చెప్పారు. ఏవేవే సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని వాటిని నమ్మెద్దంటూ హితవు పలికారు. 

తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పర్యటించానని అయితే తన సర్వేలో 100 స్థానాల్లో గెలుస్తామని వచ్చిందన్నారు. ఇతర సర్వేల ప్రకటనలతో ఏం ఆందోళన చెందొద్దని టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ బిడ్డగా  ధైర్యంగా చెప్తున్నానని మనదే అధికారం అంటూ ప్రకటించారు. అందుకు గజ్వేల్ నియోజవర్గానికి ఓ సెంటిమెంట్ కూడా ఉందన్నారు. గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గెలిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లేనని తెలిపారు. 

కేసీఆర్ గెలుస్తాడా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు చప్పట్లు కొట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటేనే తన విజయం ఖాయమైపోయిందన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ గెలిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లేనని జోస్యం తెలిపారు.