Asianet News TeluguAsianet News Telugu

విజేతలు వీరే: నాలుగు టీఆర్ఎస్, ఒకటి ఎంఐఎం ఖాతాలో

తెలంగాణ లో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. ఈ ఎన్నికల్లో పోటీ లేకుండానే టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థిని ప్రకటించినా చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవడంతో అధికార పార్టీతో పాటు దాని మిత్రపక్షం ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఇప్పటికే దాదాపు ఖాయమయ్యింది. అయితే ఎన్నికలు మాత్రం అనివార్యమయ్యాయి. 

trs candidates win in telangana mlc elections
Author
Hyderabad, First Published Mar 12, 2019, 6:09 PM IST

తెలంగాణ లో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. ఈ ఎన్నికల్లో పోటీ లేకుండానే టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థిని ప్రకటించినా చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవడంతో అధికార పార్టీతో పాటు దాని మిత్రపక్షం ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఇప్పటికే దాదాపు ఖాయమయ్యింది. అయితే ఎన్నికలు మాత్రం అనివార్యమయ్యాయి. 

ఇవాళ జరిగిన ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపి లు ఈ ఎన్నికలను బహిష్కరించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలో పోలింగ్ లో పాల్గొనలేదు. 

శాసన మండలిలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానాలకోసం ఎన్నికలు జరిగాయి. ఇందులో టీఆర్ఎస్ తరపున హోంమంత్రి మహమూద్ అలీకి మరోసారి అవకాశం వచ్చింది. ఇక బీసీ సామాజిక వర్గం నుండి  ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ లు పోటీ చేశారు. ఇక మరో స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎం కు కేటాయించగా డబీర్ పురా కార్పోరేటర్ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ బరిలోకి దిగి గెలుపొందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios