నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డికి తన స్వంత మండలంలో కూడ టీఆర్ఎస్ అధిక్యాన్ని దక్కించుకొంది. ఈ మండలంపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకొంది.ఈమండలంలో కూడ  కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఓట్లు దక్కలేదు.అనుముల, పెద్దవూరల్లో పెట్టుకున్న కాంగ్రెసు ఆశలు ఆవిరి అ్యయాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి కాకుండా మరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఫలితాలు మరోలా  ఉండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 16 నుండి 20 రౌండ్ల వరకు అనుముల మండలం ఓట్లు లెక్కించారు. ఒక్క రౌండ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డికి మెజారిటీ లభించింది. మిగిలిన మూడు రౌండ్లలో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్ కే ఆధిక్యత లభించింది. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర మండలాలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకొంది. అయితే ఈ రెండు మండలాల్లో కూడ టీఆర్ఎస్ కే ఆధిక్యత లభించింది. ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ జానారెడ్డి ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

అయినా కూడ ప్రజలు ఆయనను ఆశీర్వదించలేదు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఇదే అసెంబ్లీ స్థానం నుండి ఆయన ఓటమి పాలయ్యాడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల చేతుల్లోనే జానారెడ్డి ఇప్పటికే రెండు దఫాలు విజయం సాధించారు.