హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. మరికాసేపట్లో ఈ విషయమై టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్  విడుదలైంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేది.  నల్గొండ నుండి తేరా చిన్నప్పరెడ్డి, వరంగల్  నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుండి పట్నం మహేందర్ రెడ్డిలను టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులుగా ఖరారు చేసింది.

ఈ అభ్యర్థుల ప్రకటనను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది.