Asianet News TeluguAsianet News Telugu

గుత్తాకు షాకిచ్చిన కేసీఆర్: ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నవీన్ రావు

మ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి   నవీన్‌ రావు పేరును టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానానికి  నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం సాగింది. కానీ, నవీన్‌రావు పేరును ఈ స్థానానికి ఖరారు చేశారు.

Trs announces naveen rao as a mlc candidate
Author
Hyderabad, First Published May 27, 2019, 4:38 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి   నవీన్‌ రావు పేరును టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానానికి  నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని ప్రచారం సాగింది. కానీ, నవీన్‌రావు పేరును ఈ స్థానానికి ఖరారు చేశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. గత ఏడాది  డిసెంబర్  7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి మైనంపల్లి రాజీనామా చేశారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలు చేయడానికి రేపు చివరి తేదీ. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేస్తారని కూడ ప్రచారం సాగింది. అయితే ఈ స్థానానికి తేర చిన్నపరెడ్డిని మరోసారి టీఆర్ఎస్ బరిలోకి దింపింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి గుత్తా సుఖేందర్ రె్డ్డి పేరును పరిశీలనలో ఉంది. అయితే మల్కాజిగిరి ఎంపీ స్థానం  టిక్కెట్టును నవీన్ రావు ఆశించారు. ఈ స్థానం నుండి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి  టిక్కెట్టును కేటాయించడంతో నవీన్ రావుకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.ఈ హమీ మేరకు కేసీఆర్ నవీన్ రావుకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు. యాదవరెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌లపై అనర్హత వేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం కోసం టీఆర్ఎస్ నాయకత్వం ఎదురుచూస్తోంది.  ఈ ముగ్గురిపై అనర్హత వేటు పడితే మరో మూడు స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.

ఈ మూడు స్థానాలు ఖాళీ అయితే ఒక్క స్థానాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి కేటాయించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొంటారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ పదవి ఆయనకు దక్కాలి. నేరుగా మంత్రి వర్గంలోకి తీసుకొంటే ఆరు మాసాల్లో ఎమ్మెల్యే లేదా... ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.  ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్లపై కోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా  గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios