మేడ్చల్:మేడ్చల్  జిల్లా పరిషత్ ఛైర్మెన్ అభ్యర్ధిగా టీఆర్ఎస్  మలిపెద్ది శరత్ చంద్రారెడ్డిని ప్రకటించింది.  ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేరును  శరత్ చంద్రారెడ్డి పేరును ప్రకటించారు.

మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండల జడ్పీటీసీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి  నామినేషన్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి బుధవారం నాడు పాల్గొన్నారు.  జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను  చేపడుందని ఆయన చెప్పారు. 

 టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు. మేడ్చల్ జిల్లాను అభివృద్ది చేసే బాధ్యతను తనకు వదిలివేయాలని  ఆయన కోరారు.