తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ శ్రేణుల నుంచే ఆమె నిరసన సెగ తగిలింది.
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ శ్రేణుల నుంచే ఆమె నిరసన సెగ తగిలింది. మలుగు జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను టీఆర్ఎస్ పార్టీ దళిత విభాగం శ్రేణులు అడ్డుకున్నారు. గట్టమ్మ దేవాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ వాహనం దిగి మాట్లాడేందుకు పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సత్యవతి రాథోడ్ కాళ్లకు నమస్కరించి వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
దళిత బంధు విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అర్హులైన వారికి ఇవ్వకుండా.. తనకు ఇష్టమొచ్చినవారికి దళిత బంధు అందేలా చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీలో ఉండి కూడా దళిత బంధు విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. మంత్రులు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వత్తాసు పలకడం ఏమిటని నిలదీశారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ వారితో మాట్లాడి ఆందోళన విరమింపచేసే ప్రయత్నం చేశారు. అనంతరం ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన కొనసాగుతుంది.
