Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బై పోల్: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బూర నర్సయ్య గౌడ్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Trs Activists protest against boora narsaiah goud at choutuppal
Author
First Published Oct 22, 2022, 2:20 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బూర నర్సయ్య గౌడ్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాలు.. బూర నర్సయ్య గౌడ్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. అయితే బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే ఈ  పరిణామాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు యత్నించగా తోపులాట చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక, అభివృద్ధిపై చర్చకు రావాలని జై కేసారంకు ఇన్ఛార్జీగా ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios