Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్: అక్కడికే హరీష్ రావు పరిమితం

టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావుకే ట్రబుల్ మొదలైందని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్న స్థితిలో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కావాల్సి వస్తోంది.

Trouble shooter in TRS Harish Rao faces trouble
Author
Siddipet, First Published Feb 8, 2020, 5:31 PM IST

అధికార పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సైలెంట్ అయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకున్నా రంగంలోకి దిగి పరిస్థితులు చక్కబెట్టే హరీష్ ఇప్పుడు మెదక్ జిల్లా కే పరిమితం అవుతున్నారు.

 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా బాధ్యతలు నిర్వహించుకుంటూ తన పని తాను చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు వెన్నంటే ఉన్న హరీష్ తొలివిడత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినా.... రెండోసారి అధికారం చేపట్టిన టిఆర్ఎస్ లో మాత్రం పూర్తిగా సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. 

ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలివిడతలో మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కని హరీష్ రావు రెండో విడత  విస్తరణలో ఆర్థికమంత్రిగా అవకాశం దక్కింది.

 అయినా రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ అభిమానులు, అనుచరులు హరీష్ రావు కు ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గుతోందన్న  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో హరీష్ రావు అనుచరుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

 మంత్రివర్గంలో చోటుదక్కినా ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించడంతో ప్రజలతో పెద్దగా సంబంధం లేని శాఖ అప్పగించారన్న ప్రచారం రోజురోజుకు  పెరుగుతుంది.

ప్రజాప్రతినిధులతో, ప్రజలతో ఎలాంటి సంబంధం లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చక్క  బేట్టడమే హరీష్ రావు బాధ్యత గా మారిందని హరీష్ అనుచరులు వాపోతున్నారు. 

 ప్రజా నాయకుడిగా గుర్తింపు ఉన్న హరీష్ రావు కు దాదాపు ఏడాది కాలంగా ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  పార్టీ  హోరా హోరీగా  ఢీకొట్టినా 9 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. హరీష్ రావుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా మరి కొన్ని స్థానాల్లో విజయం దక్కేదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి.

మొత్తం మీద ట్రబుల్ షూటర్ హరీష్ కే పొలిటికల్ గా ట్రబుల్స్ ఎదుర్కోక తప్పడం లేదన్న పొలిటికల్  సర్కిల్ లో ప్రచారం జోరందుకుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios