Asianet News TeluguAsianet News Telugu

మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో గిరిజన తండాలు: మంత్రి రాథోడ్

Warangal: ఇంత‌కుముందు ప్ర‌భుత్వాలు గిరిజన వర్గాల అభివృద్ధిని విస్మరించాయనీ, అయితే కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అందుకు భిన్నంగా అభివృద్ధి జ‌రుగుతోంద‌ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
 

Tribal Thandas in development like never before: Minister Satyavathi Rathod
Author
First Published Dec 21, 2022, 8:06 PM IST

Tribal Welfare Minister Satyavathi Rathod: ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తల్లి బిడ్డల సంరక్షణ కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టార‌ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించి మంత్రి.. గర్భిణీలకు కిట్లను అందజేశారు.

 

అలాగే, ములుగు జిల్లా కేంద్రంలో మంగపేట మండలానికి చెందిన రాజుపేట, కమలాపూర్ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్స్ ను పంపిణీ చేశారు. నర్సంపేట మం. అశోక్ నగర్ లోని  TTWREIS సైనిక్ స్కూల్లో రాష్ట్ర స్థాయి ఇగ్నైట్ ఫెస్ట్‌కు హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రకళ, సైన్స్‌ ప్రాజెక్టును సందర్శించి వివిధ పోటిల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అలాగే, ములుగు జిల్లా కేంద్రంలో మంగపేట మండలానికి చెందిన రాజుపేట మరియు కమలాపూర్ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్స్ ను పంపిణీ చేశారు. 

 

 ఆదివాసీ వర్గాల అభివృద్ధిని ఇదివ‌ర‌క‌టి ప్రభుత్వాలు విస్మరించాయనీ, అయితే కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అందుకు భిన్నంగా అభివృద్ధి జ‌రుగుతోంద‌ని  అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండల పరిధిలోని బిక్కోజి నాయక్ తండా-బాలు నాయక్ తండా మధ్య రూ.2.68 కోట్లతో బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన త‌ర్వాత‌ మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల సౌకర్యార్థం అన్ని అంతర్గత ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 3,146 తాండాలు గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయ‌ని తెలిపారు. గిరిజన సంఘాలను బలోపేతం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మరింత అభివృద్ధిని అనుసరించి, తెలంగాణలోని గిరిజనులు గౌరవం, స్వావలంబనను సాధించడానికి మంచి స్థానంలో ఉన్నారని చెప్పారు.

దేశంలో నిరంతరాయంగా 24X7 విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గుజరాత్‌లో కానీ, ఢిల్లీలో కానీ అలాంటి ప‌రిస్థితులు లేవ‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసే బదులు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు తమ పాలనలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాల‌ని స‌త్య‌వ‌తి రాథోడ్‌ అన్నారు. త‌మ ప్ర‌భుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులకు ఆసరా పింఛన్లు అందిస్తున్న‌ద‌ని తెలిపారు.  అలాగే, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ల విష‌యంలో  తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె విమ‌ర్శించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మరని మంత్రి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios