పోటెత్తిన గోదావరి: భద్రాచలం బ్రిడ్జిపై నుండి 48 గంటలు రాకపోకలు నిలిపివేసే చాన్స్

భద్రాచలం వద్ద ఉన్న బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది అధికారులు. గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Transport likely to stop  In Bhadrachalam Bridge 48 hours From 14 july evening

భద్రాచలం: Godavari నదికి వరద పోటెత్తడంతో Bhadrachalam  పట్టణానికి సమీపంలో ఉన్న బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేయనున్నారు. గోదావరి నదికి గురువారం నాడు సాయంత్రం నుండి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. 1986లో వచ్చిన వరదను మించి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ Bridge కి ఒకవైపు భద్రాచలం పట్టణం, మరో వైపు బూర్గుంపహడ్ ఉంటాయి. దీంతో ఈ రెండు మండలాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. 1986లో ఈ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహించింది. అయితే గోదావరికి వరద పెరిగే అవకాశం ఉన్నందున ఇవాళ కూడా బ్రిడ్జి ఎత్తులో వరద ప్రవహించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

తుపాకుల గూడెం నుండి 24 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి 62 అడుగులకు చేరింది. గురువారం సాయంత్రం నుండి గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నదిలో 17 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. 

భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులకు చేరితే లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం సమీపంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను కరకట్టను నిర్మించారు.ఈ కరకట్టతో భద్రాచలం పట్టణంలోకి వరద నీరు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. 

also read:భద్రాచలం వద్ద టెన్షన్: 61 అడుగులకు చేరిన గోదావరి, 144 సెక్షన్ విధింపు

 పేరూర్ వద్ద గోదావరి నది 18 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా వరద పోటెత్తినట్టుగా అధికారులు చెబుతున్నారు.  ఇప్పటికే భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్ కు, చత్తీస్ ఘడ్ కు  వెళ్లే రహదారులు నీటిలో మునిగిపోయాయి. సాయంత్రానాకి కొత్తగూడెం నుండి భద్రాచలానికి వచ్చే రోడ్డు మార్గం కూడా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios