భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు షురూ: భారీ వాహనాలకు నో పర్మిషన్
భద్రాచలం వద్ద గోదావరిపై రాకపోకలను ఆదివారం నాడు మధ్యాహ్నం పునరుద్దరించారు. భధ్రాచలం బ్రిడ్జిపై భారీ వాహనాలకు రాకపోకలను మాత్రం అనుమతించడం లేదు.
భద్రాచలం: Bhadrachalam వద్ద Godavari పై రాకపోకలను ఆదివారం నాడు మధ్యాహ్నం పునరుద్దరించారు. గోదావరికి భద్రాచలం వద్ద వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో రాకపోకలను పునరుద్దరించారు. మరో వైపు ఈ Bridge పై భారీ వాహనాలకు బస్సులకు అనుమతిని నిరాకరించారు అధికారులు. ఈ నెల 15వ తేదీన గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు. గోదావరి నదికి వరద పోటెత్తడంతో గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఇవాళ ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఆదివారం నాడు మధ్యాహ్నం భద్రాచలం వద్ద గోదావరి వద్ద 63 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను పునరుద్దరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే భారీ వాహనాలకు ఇప్పుడే ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో గోదావరి బ్రిడ్జి శనివారంనాడు కొంత కుదుపులకు గురైందని స్థానికులు చెబుతున్నారు.
గోదావరి బ్రిడ్జి పై భాగానికి సమీపంగా గోదావరి వరద ప్రవహించింది. ఈ బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణం మంజూరైంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమై పిల్లలర్ల నిర్మాణం సాగుతుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. అయితే Telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాని పరిస్థితి నెలకొంది.
also read:భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు, క్లౌడ్ బరస్ట్ అనుమానాలు: కేసీఆర్
భద్రాచలంలో పునరావాస కేంద్రంలో ఉన్న ముంపు బాధితులతో తెలంగాణ సీఎం KCR ఇవాళ మాట్లాడారు. భద్రాచలం పట్టణంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కరకట్ట నిర్మాణాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి నదికి వరద వచ్చిన సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా శాశ్వత చర్యలు తీసుకొంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తడంతో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ఏటూరు నాగారం వెళ్లారు. ఏటూరు నాగారంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కేసీఆర్ ఏటూరు నాగారంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏటూరు నాగారంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నదికి శాంతి పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం ఏటూరు నాగారం నుండి సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి భద్రాచలం చేరుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఉమ్మడి ఖమ్మంజిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ నెల 29వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భద్రాచలంలో సీఎం ప్రకటించారు.ఈ మేరకు వాతావరణశాఖకు చెందిన సంస్థలు ప్రకటించినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు.