Asianet News TeluguAsianet News Telugu

సీఎం చెప్పినా నిధులు ఇవ్వడం లేదు..: ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలనం

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ సంస్థలకు దక్కుతున్న ఆదరణ చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని అన్నారు. 

Transco and Genco CMD Prabhakar Rao sensational comments on some IAS Officers ksm
Author
First Published Oct 16, 2023, 2:59 PM IST

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ సంస్థలకు దక్కుతున్న ఆదరణ చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కొందరు ఐఏఎస్‌లు తమ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ తమ సంస్థలకు నిధులు ఇవ్వడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించడం  లేదని తెలిపారు. ఈ విధానం ఇలాగే ఉంటే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios