హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ని బంట్వారం మండలం సుల్తానా్ ‌పూర్ లో ఆదివారం నాడు ట్రైనీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ విశాల్ మృతితో పాటు మరోకరు మృతి చెందారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఆదివారం నాడు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి  ట్రైనీ విమానం బయలుదేరింది.  విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలింది.

సుల్తాన్‌పూర్‌లోని పత్తిచేనులో ఈ విమానం కుప్పకూలింది.వాతావరణం సరిగా లేకపోవడంతో ఈ విమానం కూలిపోయింది, సుల్తాన్‌పూర్ సమీపంలోకి విమానం చేరుకోగానే వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా విమానం అదుపు తప్పింది. కూలిపోయే ముందు విమానం గాల్లో చక్కర్లు కొట్టిందని స్థానికులు చెప్పారు.

వర్షం కారణంగా పైలెట్ విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పత్తి చేనులోనే ఆ విమానం కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.