కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సన్ డే ఫన్ డే కార్యక్రమం దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ట్యాంక్ బండ్‌పై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  

రేపు ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్ డే కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు నగరవాసులను కోరారు. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన సన్ డే ఫన్ డే కార్యక్రమం దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమవుతోంది. ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.