నేడు, రేపు హైదరాబాద్ లో వెంకయ్య పర్యటన ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారి వస్తున్న వెంకయ్య పౌర సన్మానం ఏర్పాటు చేసిన కెసిఆర్ సర్కారు వెంకయ్య పర్యటన నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి ఇవాళ వస్తున్నారు. ఆయన రాక సందర్భంగా నేడు, రేపు (సోమ, మంగళ వారాల్లో) హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

 21న ఉదయం 10.45 గంటల నుంచి 11.30 గంటల వరకు బేగంపేట ఎయిర్‌ పోర్టు, పీఎన్‌టీ జంక్షన్‌, శ్యాంలాల్‌బిల్డింగ్‌, హెచ్‌పీఎస్‌, బేగంపేట ఫ్లై ఓవర్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, మోనప్ప ఐ లాండ్‌, ఎంఎంటీఎస్‌, రాజ్‌భవన్‌ రైల్వే గేట్‌, వీవీ విగ్రహం మార్గాల్లో వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లిస్తారు. 22వ ఉ. 7.15 నుంచి 8 గంటల వరకు రాజ్‌భవన్‌, యశోద ఆస్పత్రి, మోనప్ప ఐ లాండ్‌, ఎంఎంటీఎస్‌, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు దారుల్లో వెళ్లే వాహనాలను మళ్లిస్తారు. నగర ప్రజలు ఈ విషయంలో సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

తెలుగు జాతికి చెందిన వ్యక్తి, ఆంధ్రా నేత ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన నేపథ్యంలో తెలంగాణ సర్కారు వెంకయ్యనాయుడుకు పౌర సన్మానం ఏర్పాటు చేసింది. రాజ్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ పౌర సన్మానం విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ సర్కారు పత్రికల్లో ప్రముఖంగా వాణిజ్య ప్రకటనలు విడుదల చేసింది.