హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో శుక్రవారం హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈమేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలతో సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గకుండా ప్రత్యామ్నయ మార్గాల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కింద తెలిపిన ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ర్యాలీ ప్రారంభమయినప్పటి నుంచి ర్యాలీ సాగుతున్న రూట్‌లో దారి మళ్లింపు కొనసాగుతుందని వెల్లడించారు.

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన రూట్స్ ఇవే..

అఫ్జల్‌గంజ్, ఎస్‌జె బ్రిడ్జి, శంకర్‌షేర్ హోటల్, ముక్తీయార్ గంజ్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం మీదుగా సీబీఎస్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌లోని వాహనాలను పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా రంగ్‌మహల్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* గౌలిగూడ రాంమందిర్ వద్ద ఊరేగింపు మొదలైన తర్వాత చాదర్‌ఘాట్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రంగ్‌మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు.
* పుత్లీబౌలి నుంచి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ఊరేగింపు వెళుతున్న సమయంలో జీపీఓ నుంచి కోఠీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే మార్కెట్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* ఊరేగింపు కోఠి ఆంధ్రబ్యాంక్ జంక్షన్‌కు చేరుకున్న సమమయంలో చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే ట్రాఫిక్‌ను, డీఎం అండ్ హెచ్‌ఎస్ జంక్షన్ వద్ద సుల్తాన్‌బజార్ క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
* ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు వచ్చిన సమయంలో వేర్వేరు మార్గాల నుంచి కాచిగూడ చౌరస్తాకు వస్తున్న ట్రాఫిక్‌ను టూరిస్ట్ హొటల్ జంక్షన్ వద్ద నుంచి బడీచౌడీ వైపు మళ్లిస్తారు. 
* బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు, ఈ ట్రాఫిక్‌ను ఓల్డ్‌పోస్టాఫీస్ మీదుగా కాచిగూడ వైపు మళ్లిస్తారు.

అజమాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను వీఎస్‌టీ క్రౌన్ కేఫ్ వద్ద దారి మళ్లిస్తున్నారు.
* ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు వచ్చే ట్రాఫిక్‌ను మెట్రో కేఫ్ నుంచి రాంనగర్ టీ జంక్షన్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నారాయణగూడ ైఫ్లె ఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. నారాయణగూడ ైప్లెవోవర్ కింద నుంచి హిమయత్‌నగర్ జంక్షన్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు. 
* కింగ్‌కోఠీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వాహనాలు అనుమతించడంలేదు. ఇడెన్ గార్డెన్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* ఊరేగింపు సమయంలో కవాడీగూడ రోడ్ ప్రాగా టూల్స్ మార్గంలో ట్రాఫిక్‌ను అనుమతించరు. 
* కర్బలా మైదాన్ నుంచి కవాడిగూడ వైపు ట్రాఫిక్‌ను అనుమతించడంలేదు. ఈ వాహనాలను చిల్ట్రన్ పార్కు వద్ద దారి మళ్లిస్తారు.
* లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను డీబీఆర్ మిల్ వద్ద అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు దారి మళ్లిస్తారు.
* ముషీరాబాద్ చౌరస్తా నుంచి ట్రాఫిక్‌ను కవాడిగూడ వైపు అనుమతించరు. గాంధీనగర్ నుంచి ప్రాగా టూల్ వైపు దారి మళ్లిస్తారు.