Asianet News TeluguAsianet News Telugu

ఎల్లుండి హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి (మే 26) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. 

Traffic Advisory in hyderabad for PM Modi Visit on 26th may
Author
Hyderabad, First Published May 24, 2022, 5:13 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి (మే 26) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీజీ రంగంలోకి దిగి ఐఎస్‌బీ క్యాంపస్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో.. మొత్తం 930  మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330  విద్యార్థులు ఉన్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

-గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న కంపెనీలు.. వారి ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలి.

 

 

-గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద నుంచి బొటానికల్ గార్డెన్- కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-మసీదు బండ- మసీదు బండ కమాన్- హెచ్‌సీయూ డిపో రోడ్డు మార్గంలో వెళ్లాలి. 

-లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు..  హెచ్‌సియు డిపో రోడ్డు- మసీదు బండ కమాన్- మసీదు బండ-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి- బొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలి.  

-విప్రో నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూ సిటీ- గౌలిదొడ్డి- గోపనపల్లి ఎక్స్‌ రోడ్డు- హెచ్‌సీయూ బ్యాక్ గేట్- నల్లగండ్ల మీదుగా వెళ్లాలి. 

-విప్రో నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. ఫెయిర్‌ఫీల్డ్ హోటల్‌- నానక్‌రామ్‌గూడ రోటరీ- ఔటర్ రింగ్ రోడ్డు- ఎల్‌అండ్‌ టీ టవర్స్‌ మార్గంలో వెళ్లాలి. 

-కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. కేబుల్ బ్రిడ్జ్పైకి ఎక్కే ర్యాంప్ నుంచి రైట్ తీసుకొని రత్నదీప్- మాదాపూర్ పీఎస్- సైబర్ టవర్స్- హైటెక్స్- కొత్తగూడ- బొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios