టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ  రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం హామీ విస్మరించారని.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వారినే తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని.. చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని రేవంత్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఆరేళ్లు చేసేందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

వనపర్తి నియోజకవర్గంలో తులసివనంలో గంజాయి మొక్క అయిన నిరంజన్ రెడ్డి ని గెలిపించి చాలా తప్పు చేశారని, గుడి మాన్యాలను, వనపర్తి నడిబొడ్డున వున్న 300 కోట్ల భూములను మంత్రి కొల్లగొడుతున్నార‌న్నారు.

తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ చేతిలో మోస‌పోయినవారేన‌ని, అందుకే వాడికి ఓటుతో గుణపాఠం చెప్పండని పిలుపునిచ్చారు. సిగ్గు మాలిన దద్దమ్మలు బీజేపీ నాయకులు… రైతులను, నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఎలా ఓటు ఎలాఅడుగుతారని ప్ర‌శ్నించారు.