ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో అంచనాలు పెంచి  దుబారా చేశారని  కాంగ్రెస్ పార్టీ  చీఫ్ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై సమాధానం చెప్పకుండా  మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడాన్ని  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క  తప్పుబట్టారు. 

హైదరాబాద్: ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో అంచనాలు పెంచి దుబారా చేశారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై సమాధానం చెప్పకుండా మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. 

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యావంతుడైన కేటీఆర్ తమ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై సరైన సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. తమపై కేటీఆర్ చేసిన విమర్శలు ఆయన నాగరికతను చాటుతున్నాయన్నారు.

కేటీఆర్ మంత్రిగా ఉన్నందుకు తాము సిగ్గుపడుతున్నామన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ రూ. 28 వేల నుండి రూ. లక్ష కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచినట్టు ఆయన ఆరోపించారు.

తాము చెప్పిన విషయాలు వాస్తవమని మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయమై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. కేటీఆర్, , హరీష్ లలో ఎవరో ఒక్కరొచ్చినా...లేక ఇద్దరూ వచ్చినా ఈ విషయమై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులపై కూడ చర్చకు సిద్దంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. కొత్త, పాత ప్రాజెక్టులకు కూడ మంత్రి తమ్మలకు తేడా తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ వార్తలు చదవండి

లుచ్ఛాగాళ్లు: రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

నీ చరిత్ర చెబితే.. బయట తిరగలేవు కేటీఆర్... పొన్నం