ఆ కుటుంబంతో పోల్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు : భట్టి విక్రమార్క

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 7, Sep 2018, 3:46 PM IST
tpcc working president batti vikramarka fires on kcr family
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిసారి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని విమర్శించి తన స్థాయిని వారితో పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మండిపడ్డారు. కానీ వారికి కేసీఆర్ కు అసలు పోలీకే లేదని అన్నారు. దేశ ప్రధాని పదవిని సైతం వదిలేసిన కుటుంబం సోనియా, రాహుల్ ది అయితే, తనకు, తన కొడుకుకు, కూతురికి, అల్లుడికి పదవులిచ్చిన చరిత్ర కేసీఆర్ ది అంటూ భట్టి ఘాటు విమర్శలు చేశారు.
 
శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన టిపిసిసి కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా, రాహుల్ లను కేసీఆర్ విమర్శించడం తగదని భట్టి మండిపడ్డారు. గురువారం కేసీఆర్ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ని పట్టుకుని బఫూన్ అని తిట్టడం, గతంలో కేటీఆర్ సోనియాగాంధిని అమ్మనా...బొమ్మనా అని తిట్టడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలు సోనియాను దేవతలా చూస్తున్నారని ఆ విసయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని, వారి కోరిక త్వరలో తీరనుందని భట్టి పేర్కొన్నారు. తొమ్మిది నెలల ముందే ఎన్నికలు రావడం అదృష్టం భావిస్తున్నట్లు తెలిపారు.రానున్న ధర్మ యుధ్దంలో ఫీపుల్స్ గవర్మెంట్ ఏర్పడటం ఖాయమని భట్టి స్పష్టం చేశారు.

loader